#వార్తలు

🛕1000 కిలోల ఆలయాల బంగారం కరిగించిన తమిళనాడు.. ఎందుకంటే!

Temple Gold Turns into Temple Growth.!

తమిళనాడు సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది!

 

21 ఆలయాల్లో భక్తులు సమర్పించిన 1000 కిలోలకుపైగా బంగారు వస్తువులు  నిరుపయోగంగా         ఉండడంతో, వాటిని కరిగించి 24 క్యారెట్ గోల్డ్ బార్లుగా మార్చింది.

 

 

ఈ బంగారం‌ను బ్యాంకులో డిపాజిట్ చేయడంతో, ఏటా రూ.17.81 కోట్ల వడ్డీ వస్తోంది. ఇది మొత్తం ఆలయాల అభివృద్ధికే వినియోగిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

🔑 ముఖ్యాంశాలు:

    • హిందూ మత, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం.

    • ఏటా వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఆ ఆలయాల అభివృద్ధికే వినియోగించనున్నారు.

    • ఈ పథకం పారదర్శకతకోసం మూడు కమిటీలు – ప్రతి ప్రాంతానికి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి.

📢 అసెంబ్లీలో ఈ వివరాలు మంత్రి శేఖర్ బాబు ప్రవేశపెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *